నువ్వు చెప్తే.. మేము చూసుకుంటాం.. నాగవంశీ ట్వీట్‌తో అయోమయంలో విజయ్ ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’.

నువ్వు చెప్తే.. మేము చూసుకుంటాం.. నాగవంశీ ట్వీట్‌తో అయోమయంలో విజయ్ ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘కింగ్‌డమ్’. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. జులై 31 న థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండగా.. ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ‘కింగ్‌డమ్’ సినిమా ట్రైలర్ ఈనెల 26న రాబోతుంది.

తాజాగా, నాగవంశీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఈ నెల 28న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్‌లో ‘కింగ్‌డమ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం. ఆ రోజు ఏమైనా వర్షం పడే అవకాశం ఉందా. ఒకసారి చెప్పు బాలాజీ. ఆ తర్వాత మేము చూసుకుంటాం’’ అని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీని అడుగుతూ పోస్ట్ పెట్టాడు. ఇక దీనికి ఆయన చినుకులు పడతాయని చెప్పడంతో నాగవంశీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. అసలు ఈవెంట్ నిర్వహిస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

link

Next Story