సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం?

by Disha Web Desk 6 |
సల్మాన్ ఖాన్ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వడం ఖాయం?
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ధరించే వస్తువుల ధరలు భారీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. కొందరు కోట్ల రూపాయల వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడితే, మరికొందరు లక్షల రూపాయల విలువైన దుస్తువులతో దర్శనమిస్తున్నారు. ఇటీవల స్టార్ హీరోలు ఖరీదైన వాచ్‌లతో ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ వాచ్‌ ధరకు సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సల్లూ భాయ్ ‘కిసికా భాయ్ కిసీకీ జాన్’ ప్రమోషన్స్‌లో ధరించిన వాచ్ అందరినీ ఆకర్షిస్తోంది. సల్మాన్ ధరించిన గోల్డెన్ కలర్ రోలెక్స్ కంపెనీ వాచ్‌ ధర రూ. 57, 200 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 47 లక్షలు. సల్మాన్ ఖాన్ వైట్ టీ షర్ట్ గొల్డెన్ కలర్ వాచ్ ధరించి దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో వాచ్ ధర తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Next Story

Most Viewed