బిగ్‌బాస్‌కు వెళ్తే అవకాశాలు రాక రోడ్‌మీద పడాల్సిందే.. సంచలన నిజాలు బయటపెడుతూ నటి షాకింగ్ పోస్ట్!

by Mallepaka Hamsa |

రియాలిటీ షో బిగ్‌బాస్ ‌లో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని తమ సత్తా చాటారు.

బిగ్‌బాస్‌కు వెళ్తే అవకాశాలు రాక రోడ్‌మీద పడాల్సిందే.. సంచలన నిజాలు బయటపెడుతూ నటి షాకింగ్ పోస్ట్!
X

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ ‌లో ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని తమ సత్తా చాటారు. కొందరు తమ ఆట తీరుతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటే.. కొందరు విన్నర్స్ అయి తమ పాపులారిటీని పెంచుకున్నారు. కానీ కొంతమంది మాత్రం బిగ్‌బాస్ వల్ల వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉన్నట్లు తెలుపుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, బిగ్‌బాస్ సీజన్-5లో పాల్గొన్న ఆర్జే కాజల్ (RJ Kajal)ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియోను షేర్ చేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా వచ్చే ఫేమ్ కేవలం కొంతకాలమూ అని.. అది కెరీర్‌ను నిర్మించదని కాజల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. షో ముగిసిన తర్వాత కొన్నాళ్ల పాటు హడావుడి ఉంటుందని, ఆ తర్వాత అవకాశాలు రాక చాలామంది నటీనటులు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అలా కావడానికి కారణం టాలెంట్ లేక కాదని అవకాశాలు రాక అని స్పష్టం చేసింది. ‘‘నిన్ను అందరూ చూసేశారు, మాకు కొత్త ముఖాలు కావాలి" అని మేకర్స్ రిజెక్ట్ చేయడం వల్లే చాలామంది ఖాళీగా ఉంటున్నారని చెప్పింది. ఫేమ్ ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని, రెమ్యూనరేషన్ విషయంలో తీవ్రమైన బేరసారాలు జరుగుతున్నాయని కాజల్ ఆరోపించింది. రోడ్డు మీద జనం గుర్తుపట్టి సెల్ఫీలు అడిగినంత మాత్రాన కెరీర్ సెట్ అయినట్లు కాదని, అవకాశాల కోసం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడమో లేదా యూట్యూబ్ ఛానెల్స్‌కు పరిమితమవ్వడమో జరుగుతోందని వివరించింది. బతకడం కోసం తక్కువ మొత్తానికే పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని, బిగ్‌బాస్ వల్ల జీవితాలు మారిపోతాయని అనుకోవడం భ్రమ మాత్రమే అని తెలిపింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కాజల్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ పరిశ్రమలోని చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చిందని మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం షో ద్వారా భారీగా సంపాదించిన తర్వాత ఇప్పుడు సింపతీ డ్రామాలు ఎందుకంటూ విమర్శిస్తున్నారు. ఏదేమైనా, గ్లామర్ ప్రపంచంలో కనిపించే మెరుపుల వెనుక ఉండే కఠిన వాస్తవాలను కాజల్ ఈ వీడియో ద్వారా బయటపెట్టడంతో అది కాస్త నెట్టింట దుమారం రేపుతోంది.

Next Story