సమంత నుంచి ఎక్కువ ఆశిస్తే నిరాశే మిగులుతుంది!

by Disha Web Desk 10 |
సమంత నుంచి ఎక్కువ ఆశిస్తే నిరాశే మిగులుతుంది!
X

దిశ, సినిమా: స్టార్‌ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. హిందీలో రూపొందుతున్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే హాలివుడ్‌లో ఈ ‘సిటాడెల్‌’ సిరీస్‌లో ప్రియాంక చోప్రా శృతి మించి అందాలు ఆరబోసింది. రొమాంటిక్ సీన్‌లో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు ఇదే సిరీస్‌ ఇండియన్ వెర్షన్ చేస్తున్న సమంత, వరుణ్ ధావన్‌ల మధ్య కూడా అలాంటి రొమాంటిక్ సన్నివేశాలు పీక్స్‌లో ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సిటాడెల్‌’ ఇంగ్లీష్ వెర్షన్‌లో మాదిరిగా, హిందీలో హద్దు మీరిన ఇంటిమేట్ బెడ్‌ రూమ్ సీన్స్ ఉండవని క్లారిటీ ఇవ్వడం జరిగింది. క్రేజీ ఫాలోయింగ్ ఉన్న సమంతను మరీ ఎక్కువ రొమాంటిక్‌గా చూపిస్తే కొందరు ఫ్యాన్స్ ఊరుకోరరనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అలాంటి మసాలా సీన్స్ ఉంటాయని ఎదురుచూస్తున్న వారికి నిరాశ తప్పదు అంటు చర్చించుకుంటున్నారు నెటిజన్స్.

Also Read..

Pushpa 2 ఐటమ్ సాంగ్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్..! పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన భామ

Next Story

Most Viewed