ఈ మూవీ చూసి మీరు షాక్ కాకపోతే.. నేను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. రాజేంద్రప్రసాద్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Mallepaka Hamsa |

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఒకప్పుడు హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్నారు.

ఈ మూవీ చూసి మీరు షాక్ కాకపోతే.. నేను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. రాజేంద్రప్రసాద్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఒకప్పుడు హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన సినిమాల్లో నటించే దానికంటే.. పలు ఈవెంట్లతో వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ‘మాస్ జాతర’(mass jathara) సినిమాతో రాబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ స్టేట్‌మెంట్ చేశాడు. ‘‘మాస్ జాతర సినిమా చూసి మీరు షాక్ కాకపోతే నేను సినిమా ఇండస్ట్రీని వదిలేస్తాను.

అన్ని మసాలాలు సరిగ్గా ఉన్న మాస్ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ఆ లోటుని తీర్చేది ఈ ‘మాస్ జాతర’. ఈ చిత్రం చూసి మీరందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటిదాకా ఎందరో హీరోలతో కలిసి నటించాను. కానీ, రవితేజతో నటించలేదు. 'మాస్ జాతర' లాంటి మంచి మూవీ చేయాలనే ఇంత సమయం పట్టినట్టుంది. దర్శకుడు భాను అద్భుతమైన సినిమాని రూపొందించాడు. చిత్రం ఎలా ఉంటుంది? నా పాత్ర ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు చెప్పను.

మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూసి ఆనందించాల్సిన చిత్రమిది. మేమందరం భయం భక్తులతో ఈ సినిమా చేశాము. ఇందులో యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. అద్భుతమైన మాస్ సినిమా ఇది. ‘మాస్ జాతర’ చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులంతా మమ్మల్ని మెచ్చుకుంటారు’’ అని అన్నారు. కాగా ఈ మూవీలో రవితేజ, శ్రీలీల జంటగా నటించారు. భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story