- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపుతుంది.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
తన అందం, నటనతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan).

దిశ, సినిమా: తన అందం, నటనతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న యంగ్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan). స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ‘ట్రైన్’ (train)చిత్రంలో షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంటోంది. సమయం దొరికనప్పుడల్లా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ట్రోల్స్‌పై తన దైన శైలిలో కౌంటర్ వేసింది. ‘‘నేను కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్న విషయం గురించి బహిరంగంగానే మాట్లాడాను. అయినా కొంతమంది ఈమె ప్లాస్టిక్ సర్జరీల దుకాణం పెట్టింది అని పలు కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. నేను చేసింది నా వ్యక్తిగత నిర్ణయం.
నిజాయితీగా ఉంటే సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపుతుంది అనిపిస్తుంది. అయినా నేను భయపడను. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకుండా.. నేను ఎప్పుడూ నాకిష్టమైన విధంగా జీవిస్తాను. ప్రేమలోనైనా పనిలోనైనా అబద్ధపు మాటలకంటే నిజాయతీకే నేను ప్రాధాన్యం ఇస్తాను. దక్షిణాదిలో నాకు నచ్చే విషయాలు ఏంటంటే.. నటులు చాలా వినయంగా, గౌరవంగా ఉంటారు. సినిమా ప్రారంభంలో పూజలు, కొబ్బరికాయ కొట్టడం వంటి సంప్రాదాయాలు పాటిస్తారు. మొదట నాకు ఇవన్నీ కొత్తగా అనిపించినప్పటికీ.. దాని వెనక ఉన్న గౌరవాన్ని అర్థం తెలిసాక నచ్చింది. ఇక్కడ స్టార్ హీరోలు తమ విజయాన్ని విలాసవంతమైన వస్తువుల ద్వారా చూపించుకోవాలని అనుకోరు అది నాకు నచ్చుతుంది’’ అని చెప్పుకొచ్చింది.






