మేము ఆ పాటను కామెడీగా చేస్తే అదే మాకు శాపంగా మారింది.. ధనుష్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-22 01:28:11  IST  )

కొందరు కోలీవుడ్ హీరోలు తమిళ భాషతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

మేము ఆ పాటను కామెడీగా చేస్తే అదే మాకు శాపంగా మారింది.. ధనుష్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: కొందరు కోలీవుడ్ హీరోలు తమిళ భాషతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూర్య, విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోలు తెలుగులోనూ అభిమానులను క్రేజ్‌ను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ధనుష్(Dhanush)- భార్య ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 3(three) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టుకుంది. ఇక ఇందులో ధనుష్ పాడిన పాటకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ‘వై దీస్ కొలవరి డీ’ పాట గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘మేము ఈ పాటను జోక్‌గా చేశాము. కొంచెం పని చేసి పక్కన పెట్టాము. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాం. ఒకరోజు మేము దానిని మళ్లీ తెరచి చూస్తే అది చాలా ఫన్నీగా అనిపించింది. నేను మ్యూజిక్ డైరెక్టర్ ఫన్నీ ఎల్లప్పుడూ పనిచేస్తుంది. కాబట్టి దీనిని ఒకసారి చూద్దాం అని చెప్పాను. ఆ పాటనుంచి నేను ఆశించినది ప్రాంతీయ విజయం. నేను తమిళనాడు నుంచి వచ్చాను. తమిళం ప్రపంచంలోని పూరాతన భాషలలో ఒకటి.

కానీ ఆ పాట తమిళంలో లేదు. ఇది తంగ్లీష్‌లో ఉంది. నేను ఆ పాట నుంచి పారిపోతూనే ఉన్నాను. ఇది దానిని వెంటాడుతూనే ఉంది. నేను ఇప్పటికీ దానికి ఓడిపోతున్నాను. ఇది వైరల్ మార్కెటింగ్‌ను పునర్విర్వచించింది. నాకు చాలా గర్వంగా ఉంది. ఒక వరం వలే ఇది మాకు ఒక శాపంగా కూడా మారింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా.. ధనుష్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం D-54,D-55 వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు.

Next Story