- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లోకా’ విషయంలో వారు అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా.. నాగవంశీ సెన్సేషనల్ కామెంట్స్
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1’ (Lokah: Chapter 1)బాక్సాఫీసు వద్ద సంచలనంగా మారింది.

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)నిర్మాణంలో వచ్చిన ‘లోకా: చాప్టర్ 1’ (Lokah: Chapter 1)బాక్సాఫీసు వద్ద సంచలనంగా మారింది. విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల ఆదరణ రాబట్టుకుంది. చిన్న బడ్జెట్ చిత్రాల చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan), నస్లెన్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీని డొమినిక్ అరుణ్ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక బిగ్ స్క్రీన్‌పైనే కాకుండా.. ‘లోకా’ డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ సత్తా చాటుతోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, నాగవంశీ ‘లోకా’ చిత్రంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో నేరుగా తీసి ఉంటే, ప్రేక్షకులు లెక్కలేనన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండేవారని అన్నారు. ల్యాగ్ ఎక్కువైందని ఇలా పలు కారణాలు చెప్పి ఈ సినిమాను ఫ్లాప్ చేసేవారు. వారు అలా చేయకపోతే నేను నా పేరు మార్చుకుంటానంటూ సంచలన స్టేట్‌మెంట్ చేశారు. కానీ అది వేరే ఇండస్ట్రీ నుండి వచ్చింది కాబట్టి ప్రజలు అభినందిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. కొన్నిసార్లు భాషా అవరోధమే సినిమాకు వరంలా మారుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ కామెంట్స్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మేము కంటెంట్ సరిగ్గా చిత్రాలెన్నో తెలుగులో హిట్ చేశామంటూ ట్రోల్ చేస్తున్నారు.
READ MORE ...
వాళ్లను నమ్మి మేము దొరికిపోయాం.. ఈ మూవీ డిజాస్టర్ కావడంపై నాగవంశీ షాకింగ్ రియాక్షన్






