వ్యూహం సినిమాలో ఆ పార్టీ వాళ్ల బట్టలు విప్పి చూపిస్తా.. ఆర్జీవి ఆసక్తికర వ్యాఖ్యలు!

by Disha Web Desk 6 |
వ్యూహం సినిమాలో ఆ పార్టీ వాళ్ల బట్టలు విప్పి చూపిస్తా.. ఆర్జీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిజాన్ని మొహమాటం లేకుండా పలు ఆసక్తికర పోస్టులతో రచ్చ చేస్తుంటాడు. ఆర్జీవి చాలా రోజుల తర్వాత ‘వ్యూహం’ సినిమాతో రాబోతున్నారు. ఈ చిత్రం ఏపీ రాజకీయాలకు సంబంధించినదిగా సమాచారం. అయితే హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్‌ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ ఏం చేశారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

తాజాగా, ఆర్జీవి వ్యూహం గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ తెలుగుదేశంలో అందరికీ బట్టలు విప్పడం తెలుసు. మాట్లాడితే బట్టలు విప్పుతూ ఉంటారు. అందుకే నేను ఈ సినిమాలో నిజం బట్టలు విప్పి చూపిస్తా. ఈ సినిమాను కావాలని వైసీపీ వాళ్లు తీయిస్తున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. లేదు నా ఇష్టంతో ఈ సినిమా తీశాను అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి రియాల్టీ చూపించడం కోసమే ఈ సినిమాను తీశాను. నేను నమ్మిన నిజాన్ని తీశాను. దానికి ఎలాంటి ఆధారాలు చూపిస్తాను అనేది సినిమాలో చూడాలి. వైసీపీ కోసమో.. మరెవరి కోసమో నేను సినిమా తీయను. నాకు ఎవ్వరూ రూపాయి ఇవ్వలేదు. ఫలానా సినిమా తీయాలని నన్ను ఎవరూ అడగలేదు. కాకపోతే నాకు జగన్ అంటే చాలా ఇష్టం. కథ పరంగా నా ఉద్దేశం అదే. జగన్ ని పాజిటివ్ చేయడానికి కాదు.. చంద్రబాబుని నెగెటివ్ చేయడానికి కాదు. నాకు తెలిసింది.. రాజకీయాల్లో జరిగిందాన్ని బట్టి నేను కథ రాసుకొని నా అభిప్రాయాన్నే నేను సినిమాగా తీశాను’’ అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

Read More: ఆసక్తికరంగా ‘కలియుగం పట్టణంలో’ సినిమా పోస్టర్ రిలీజ్..



Next Story

Most Viewed