నా కూతురు జోలికొస్తే ఊరుకునేది లేదు.. కారుతో తొక్కిస్తానంటూ కాజోల్ స్ట్రాంగ్ వార్నింగ్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) హారర్ థ్రిల్లర్ ‘మా’(maa) సినిమాతో రాబోతుంది.

నా కూతురు జోలికొస్తే ఊరుకునేది లేదు.. కారుతో తొక్కిస్తానంటూ కాజోల్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) హారర్ థ్రిల్లర్ ‘మా’(maa) సినిమాతో రాబోతుంది. విశాల్ ఫ్యూరియా(Vishal Furia) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రోనిత్ రాయ్(Ronit Roy), కెరిన్ శర్మ, నితిన్, సూర్‌సజ్యశిఖా దాస్, ఇంద్రనీల్ సేన్ గుప్త(Indranil Sengupta) కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో కాజోల్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, తన కూతురిని ట్రోల్ చేస్తున్న వారికి కాజోల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘‘నా కూతురు జోలికి వస్తే ఊరుకునేది లేదు. అలాంటి వాళ్లు నా కారు ముందుకు రావద్దు.

ఒకవేళ వచ్చారే అనుకోండి.. నా కారుతో వారిని ఢీ కొట్టి శరీరాలపై నుంచి పోనిస్తాను. సోషల్ మీడియాలో వెయ్యి మెసేజ్‌లు వస్తే అందులో 999 తను అందంగా ఉంది. మీరు అమేజింగ్ అని పెడుతున్నారు. కానీ ఎవరో ఒకరు మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టి బాధపెడుతున్నారు. ఆ చెత్త వాగుడు వాగే వారు ఎందుకున్నారో అర్థం కాదు. అయినా నేను మంచి గురించే ఎక్కువగా పట్టించుకుంటాను చెడు గురించి కాదు. అయినప్పటికీ నా కూతురిని విమర్శిస్తే మాత్రం ఊరుకోను’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story