- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మిత్రమండలి’ హిట్ అవ్వకపోతే అలా చేయండి అంటూ ప్రియదర్శి సంచలన స్టేట్మెంట్.. ఏమన్నాడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో ప్రియదర్శి(Priyadarshi), నిహారిక ఎన్ ఎం(Niharika NM) కలిసి నటించిన సినిమా ‘మిత్రమండలి’.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరో ప్రియదర్శి(Priyadarshi), నిహారిక ఎన్ ఎం(Niharika NM) కలిసి నటించిన సినిమా ‘మిత్రమండలి’. ఈ మూవీతోనే ఆమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పణలో కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ చిత్రంలో రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న ప్రియదర్శి సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ‘‘మిత్రమండలి చాలా బాగా వచ్చింది. నిజంగా బాగుంది నేను చూశాను నాకు నచ్చింది.
మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే.. సినిమా హిట్ అవ్వకపోతే.. నా నెక్స్ట్ చిత్రాన్ని మీరు చూడకండి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా.. అవును నాకు ఒక అన్న నేర్పించాడు. నాని అన్న నేర్పాడు.. సినిమాను ఎలా ప్రేమించాలో చెప్పాడు. గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా నటించాలో నేర్పాడు. ఆ అన్న చెప్పిన మాటలు నేను కాపీ కొడుతున్నా.. ‘మిత్రమండలి’ నచ్చకపోతే.. నా తదుపరి చిత్రం చూడకండి ఇది నా ప్రామిస్. దీపావళిని మేము తొందరగా తీసుకువస్తాం. అందరూ కూర్చొని హ్యాపీగా నవ్వుకోండి. సంతోషంగా మీ ఫ్యామిలీతో గడపండి’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇలా మాటలు చెప్పడం అందరికీ అలవాటు అయిందని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
READ MORE ......






