- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆమె లేకపోతే పిచ్చోడిని అయ్యేవాడిని.. స్టార్ కిడ్‌పై విజయ్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Verma), తమన్నా భాటియా కలిసి ‘లస్ట్ స్టోరీప్-2’ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేమలో పడ్డారు.

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Verma), తమన్నా భాటియా కలిసి ‘లస్ట్ స్టోరీప్-2’ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేమలో పడ్డారు. కొద్ది కాలంపాటు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపిన వీరిద్దరు అఫీషియల్ ప్రకటనతో రిలేషన్‌షిప్‌ను కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ జంట పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. కానీ అంతా బాగనే ఉందనుకునే సమయంలో.. వీరిద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారని వార్తలు జోరందుకున్నాయి. అప్పటి నుంచి ఎక్కడా ఇద్దరు కలిసి కనిపించకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, విజయ్ వర్మ తాను డిప్రెషన్‌కు గురైనట్లు వెల్లడించాడు.
‘‘కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న నాకు సడెన్ బ్రేక్ వచ్చింది. ఆ ఫీలింగ్ నన్ను చుట్టుముట్టింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉండిపోయా. ఆ బాధలో డిప్రెషన్‌కు గురయ్యా. పూర్తిగా పిచ్చోడిలా బాధపడుతున్న సమయంలో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్(Ira Khan), గుల్షన్ దేవయ్య(Gulshan Devaiah) నాకు అండగా నిలిచారు. వీడియో కాల్స్ చేస్తూ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి.. ఒకేచోట ఉండిపోకుండా కెరీర్‌లో ముందుకు వెళ్లేలా చేశారు. ఐరా ఖాన్ నన్ను ఎంతగానో ప్రోత్స హించింది. నాకు ఆమె మద్దతు లేకపోయుంటే నేను ఈ పాటిని పిచ్చోడిలా మారే వాడిని’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం విజయ్ వర్మ, ఫాతిమా సనా కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.






