అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. ఏజ్‌తో సంబంధం లేదంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది.

అలాంటి వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా.. ఏజ్‌తో సంబంధం లేదంటూ తమన్నా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannah Bhatia) వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉంది. అలాగే ఐటమ్ సాంగ్స్‌లోనూ స్టార్ హీరోలతో ఆడిపాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భాషతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తమన్నా భాటియా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది కాలంగా విజయ్ వర్మ(Vijay Verma)తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ ఈ విషయంపై తమన్నా అధికారికంగా స్పందించకపోవడంతో ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ ఎవరిని చేసుకుంటాను అనేది ఇంకా డిసైడ్ కాలేదు. నేను పెళ్లి చేసుకుంటే తమన్నా లాంటి భార్య దొరికినందుకు గత జన్మలో ఏదో పుణ్యం చేసి ఉండాలి అని అతను అనుకోవాలి. ఆ విధంగా నేను అతన్ని ప్రేమగా చూసుకుంటా. అతను కూడా నన్ను అలాగే చూసుకుంటాడు అని అనిపించిన వ్యక్తి దొరికితే ఏ మాత్రం లేట్ చేయకుండా పెళ్లి చేసుకుంటా. ఇప్పటికీ అదే ఆలోచనతో ఉన్నా. ఏజ్‌తో సంబంధం లేకుండా నేను పెళ్లి గురించి కొన్ని అంచనాలు పెట్టుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యాక మరో వ్యక్తితో తమన్నా ప్రేమలో పడిందని అందుకే ఇలా హింట్ ఇస్తోందని గుసగుసలాడుకుంటున్నారు.

Next Story