- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కమిట్ అయితే అవన్నీ పట్టించుకోను పూర్తిగా ఫోకస్ పెడతా.. న్యాయం చేయడమే నా లక్ష్యం: యామీ గౌతమ్
యామీ గౌతమ్(Yami Gautam) ‘గౌరవం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: యామీ గౌతమ్(Yami Gautam) ‘గౌరవం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ మూవీలో నటించింది కానీ పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇటీవల ‘ధూమ్ ధామ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ధురందర్’(Dhurandar) మూవీ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. జీ స్టూడియోస్ బ్యానర్‌పూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్(Sanjay Dutt), అక్షయ్ ఖన్నా, ఆదిత్య ఆధార్, జ్యోతి దేశ్ పాండే(Jyoti Deshpande), మాధవన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ గౌతమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను నిర్మాతలకు ఎప్పుడూ ఒకే విషయం చెబుతాను. కథను చెబితే వినడం కన్నా చదవడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. స్క్రిప్ట్ రాసిన విధానం వల్ల ఆ పాత్రలో నన్ను నేను ఊహించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటుంటాను. ఒకవేళ పాత్ర బలంగా అనిపిస్తే స్క్రిప్ట్ మొత్తం చదవకుండానే చాలా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాను.
కానీ ఒకసారి ఓ పాత్రకు కమిట్ అయితే మాత్రం దాని మీద పూర్తి ఫోకస్ పెడతా. నా టైమ్ మొత్తాన్ని దానికి ఉపయోగిస్తాను. అందుకే షూటింగ్ సమయంలో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటా. ఫోన్‌లో కూడా సమయం గడపను. ఎందుకంటే నేను ఏదైనా సినిమా ఓకే చేస్తే నా పాత్రకు వందశాతం న్యాయం చేయాలని డిసైడ్ అవుతాను. అదే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






