రెమ్యునరేషన్ అడిగితే బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేశారు.. స్టార్ కమెడియన్ ఆవేదన!

by Disha Web Desk 9 |
రెమ్యునరేషన్ అడిగితే బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేశారు.. స్టార్ కమెడియన్ ఆవేదన!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. దాదాపు అగ్రహీరోలందరి సినిమాల్లో నటించి ప్రేక్షకులందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఎన్నో పురస్కారాలను, అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇటీవల అలీ ఓ ఇంటర్వ్యూలో హాజరై తను బాల్యంలో జరిగిన కొన్న సంఘటలు చెప్పారు. కెరీర్ ప్రారంభంలో కొందరు నిర్మాతలు చాలా చులకనగా చూసేవారంటూ చెప్పుకొచ్చారు. ‘‘ఓ బడా నిర్మాత సంస్థ అయితే నా పాత్రకు సంబంధించి రెండు రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నారు.

తర్వాత రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఆలీతో ఏముంది లేండి. ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేయండి అని మాట్లాడారు. ఏమి మాట్లాడకుండా బిర్యానీ ప్యాకెట్ తీసుకొని వెళ్లాను. మరుసటి రోజు నా రోల్‌కు సంబంధించిన షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొన్న తర్వాత నేను షూటింగ్‌కు వెళ్లలేదు. నిర్మాతలు కాల్ చేసి అడగ్గా.. మీరు ఇచ్చిన బిర్యానీ తిని పడుకున్నానండి. అందుకే రాలేదు.’’ అంటూ అలీ కౌంటర్ వేస్తూ సమాధానం ఇచ్చారట.

Read More: ఇండియాలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రంగా గదర్ 2



Next Story

Most Viewed