మరో కోలీవుడ్ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన ఐకాన్ స్టార్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

by Gugulothu.Kavitha |   (  Updated:2026-01-05 08:01:26  IST  )

‘పుష్ప’(Pushpa) మూవీతో భారీ విజయం సాధించిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ‌(Atlee) డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్‌‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరో కోలీవుడ్ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన ఐకాన్ స్టార్..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పుష్ప’(Pushpa) మూవీతో భారీ విజయం సాధించిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రజెంట్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ‌(Atlee) డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ రేంజ్‌‌లో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా తర్వాత మరో మూవీ కోసం ఐకాన్ స్టార్ అల్లు అల్లు అర్జున్ మరో కోలీవుడ్ డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల్లోకి వెళితే.. అట్లీతో మూవీ తర్వాత గ్యాంగ్‌స్టర్, మాఫియా నేపథ్య కథలను తనదైన స్టైల్‌లో తెరకెక్కించడంలో పేరున్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో బన్నీ సినిమా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా కోసం లొకేషన్ రెక్కీ ప్రారంభించనున్నారని, ఆ తర్వాత హైదరాబాద్‌లో ప్రత్యేకంగా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అల్లు అర్జున్–అట్లీ సినిమా ఆగస్టు నాటికి షూటింగ్ పూర్తి చేసుకుంటే, వెంటనే లోకేష్ సినిమాకు బన్నీ జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More..

‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్‌కు దేవిశ్రీ ప్రసాద్ స్టెప్పులు.. నెట్టింట ట్రెండ్ అవుతున్న వీడియో

Next Story