- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్ బాస్‌కు ఐకాన్ స్టార్ స్పెషల్ గిఫ్ట్.. వైరల్‌గా మారిన ఫొటోలు
భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు.

దిశ, సినిమా: సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు, భారతీయ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడంలో కూడా తాను ఐకాన్ అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కొసానోతో జరిగిన సమావేశంలో, బన్నీ కేవలం గెస్ట్‌గా వెళ్లడమే కాకుండా మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక అద్భుతమైన కానుకను అందజేశారు. ఈ సమావేశంలో అల్లు అర్జున్ అత్యంత పవిత్రమైన ‘సీతా-రామ కల్యాణం’ పెయింటింగ్‌ను కొసానోకు బహుమతిగా ఇచ్చారు. రామాయణంలోని ఈ ఘట్టం పవిత్రతకు, ధర్మానికి , అనంతమైన ప్రేమకు నిదర్శనం. కేవలం బహుమతి ఇచ్చి వదిలేయకుండా, ఆ పెయింటింగ్ వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, రామాయణం నేర్పే విలువలను బన్నీ స్వయంగా వివరించారు. ధర్మం, త్యాగం, భక్తి వంటి అంశాలు సరిహద్దులు దాటి మనుషులను ఎలా కలుపుతాయో ఆయన చెప్పిన తీరుకు జపాన్ సీఈఓ మంత్రముగ్ధులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కాగా.. అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్‌తోనూ ఓ సినిమాను లైన్‌లో పెట్టారు. ఈ రెండు భారీ ప్రాజెక్ట్స్ కోలీవుడ్ డైరెక్టర్స్ తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






