- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Pushpa 2 Item Song: 60 ఏళ్ల బామ్మాతో ఐకాన్ స్టార్ గ్లామర్ స్టెప్పులు.. ఆమెవరో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే?
దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి ఊపుమీదున్నారు. పుష్ప పార్ట్-1 లో అద్భుతంగా నటించి.. భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఏకంగా ఈ చిత్రంలో బన్నీ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలోనే పుష్పకు సీక్వెల్ పుష్ప-2 వస్తోంది. టాలీవుడ్ నేషనల్ క్రష్ కథానాయికగా నటిస్తోన్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇకపోతే మొదటి భాగంలో బ్యూటిపుల్ హీరోయిన్ సమంత ‘ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా’ అంటూ కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా గ్లామర్ స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
ఈ సాంగ్ వింటే ఇప్పటికి యూత్ కు ఫుల్ జోష్ వస్తుంది. ఈ పాటలో స్టెప్పులేయడానికి సమంత ఏకంగా 8 కోట్లు డిమాండ్ చేసిందని అప్పట్లో టాక్ వినిపించింది. ఇకపోతే పార్ట్-2 లో కూడా డైరెక్టర్ సుకుమార్ ఐటెమ్ సాంగ్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. కాగా ఇందులో ఎవరూ అదరగొట్టే స్టెప్పులేయనున్నారని ఇప్పటికీ వీడని సస్పెన్స్‌లా మారింది. తాజాగా సోషల్ మీడియాలో వస్తోన్న టాక్ ప్రకారం.. పుష్ప-2 లో అల్లు అర్జున్ పక్కన 60 ఏళ్ల ఓ పాత హీరోయిన్ స్టెప్పులేయనుందట. మరీ ఆ కథానాయిక ఎవరో కాదు.. మీనాక్షి శేషాద్రి. ఈ హీరోయిన్ గురించి మన తెలుగు వారికి అంతగా ఐడియా లేదు.
బాలీవుడ్‌లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఎన్టీరామారావు, మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ఆడియన్స్ వద్ద మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు పుష్ప-2 తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుందని సమాచారం. ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ఐకాన్ స్టార్ 60 ఏళ్ల బామ్మాతో ఐటెం సాంగ్ చేయబోతున్నాడా? బన్నీ ధైర్యానికే మొక్కాలిరా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.