భాష తెలియకపోయినా చేసేస్తా కానీ అలాంటి పాత్రలు బోరింగ్: దర్శన రాజేంద్రన్

by Mallepaka Hamsa |

మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran) ఇటీవల ‘పరదా’ (Paradha)చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

భాష తెలియకపోయినా చేసేస్తా కానీ అలాంటి పాత్రలు బోరింగ్: దర్శన రాజేంద్రన్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్(Darshana Rajendran) ఇటీవల ‘పరదా’ (Paradha)చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అమ్మడు నటనకు బాగానే మార్కులు పడ్డాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శన తన సినిమా ఎంపిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు తెలుగు రాకపోయినా ‘పరదా’ స్క్రిప్ట్ నచ్చిందని చేశాను. భాషను తర్వాత నేర్చుకున్నాను. మంచి కంటెంట్ ఉన్న కథ వస్తే భాషతో సంబంధం లేదు ఏ భాషలోనైనా నటిస్తాను.

భాష రాకపోతే నటించడం కష్టం అని భావించా.. కానీ ఇప్పుడు నేర్చుకుని అయినా చేస్తాను. ఒకే రకమైన పాత్రలను పదే పదే చేయడం బోరింగ్ అలాగే నా నటనలో వైవిధ్యం ఉండదు. అందుకే స్క్రిప్ట్ విన్నప్పుడు అలాంటి పాత్రలో చేసినట్లుగా అనిపిస్తే తప్పించుకుంటాను. ఇక నుంచి కొత్తదనం ఉన్న ప్రత్యేక పాత్రలు మాత్రమే ఎంచుకుంటాను. అలాంటి ఆఫర్లను అస్సలు వదులుకోను’’ అని చెప్పుకొచ్చింది.

Next Story