వారి కోసం నన్ను నేను మార్చుకోను బికినీలో కూడా నటిస్తానంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

by Mallepaka Hamsa |

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు విమర్శలు కొత్తేమి కాదు. నిత్యం ఎవరో ఒకరు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు.

వారి కోసం నన్ను నేను మార్చుకోను బికినీలో కూడా నటిస్తానంటూ గట్టి కౌంటర్ ఇచ్చిన  హీరోయిన్
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు విమర్శలు కొత్తేమి కాదు. నిత్యం ఎవరో ఒకరు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. ముఖ్యంగా వారి దుస్తుల విషయంలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమంది స్పందించి వారిక కౌంటర్స్ ఇస్తుంటే..మరికొందరు మాత్రం పట్టించుకోకుండా ఉంటారు. దుస్తులను బట్టే కొంతమంది క్యారెక్టర్‌ను కూడా డిసైడ్ చేస్తుంటారు. అలాగే గ్లామరస్‌గా ఉన్నా అవకాశాలు రాకపోతే నెటిజన్లు దారుణంగా మాట్లాడుతుంటారు. హీరోయిన్ వేదిక(vedhika)కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత కొద్ది రోజుల నుంచి ఆమె వేషధారణలో పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేదిక ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది.

‘‘మహిళలు కనిపిస్తే చాలు దుస్తులను బట్టి వారి క్యారెక్టర్‌ను డిసైడ్ చేస్తున్నారు. ఇలాంటి వక్రబుద్ది కలిగిన వారిలో మార్పు రావాలి. గత కొద్ది రోజుల నుంచి నా మీద కూడా పలు విమర్శలు వస్తున్నాయని నాకు తెలిసిందే. నా దుస్తుల గురించి కూడా మాట్లాడుతున్నారు. నేను బికినీ ధరించి కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాను.. మీకేమైనా ప్రాబ్లమా? ఇలాంటి విమర్శలను నేను అస్సలు పట్టించుకోను ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు అలా అని ఎవరో ఏదో అన్నారని నన్ను నేను మార్చుకోను. నాకు నచ్చినట్లుగా ఉంటా.. కంఫర్ట్‌గా ఉన్నవి, నాకు నచ్చిన బట్టలు ధరిస్తా. ఇప్పటికైనా తప్పుడు బుద్ధితో ఆలోచించే వారు మారితే అందరికీ చాలా మంచిది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వేదిక కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story