కేజీఎఫ్-2 సినిమాపై నా అభిప్రాయం అస్సలు మార్చుకోను: డైరెక్టర్

by Disha Web Desk 6 |
కేజీఎఫ్-2 సినిమాపై నా అభిప్రాయం అస్సలు మార్చుకోను: డైరెక్టర్
X

దిశ, వెబ్ డెస్క్: కేజీఎఫ్-2 సినిమాపై టాలీవుడ్ డైరెక్టర్ మహా వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘కేరాఫ్ కంచెరపాలెం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహా వెంకటేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కేజీఎఫ్ సినిమాపై హీరో పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ వెంటనే క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. తాజాగా, మహా వెంకటేష్ కేజీఎఫ్ సినిమాపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ‘‘ ఒక బాధ్యతాయుతమైన దర్శకుడిగా నేను వాడిన భాష సరిగ్గా లేదని ఒప్పుకుంటున్నాను. దానికి క్షమాపన చెబుతున్నా. కానీ, నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకుంది. నేను కల్పిత పాత్రపై మాట్లాడాను. నేను ఒక వ్యక్తిని, దర్శకుడిని ఉద్దేశించి అలా అనలేదు’ అంటూ చెప్పుకొచ్చిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.

Next Story

Most Viewed