- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేలాంటి పాత్రలు కాకుండా కొత్తగా ట్రై చేస్తా.. నా లక్ష్యం అదేనంటూ యంగ్ బ్యూటీ కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్(Tanya Ravichandran) ‘రాజా విక్రమార్క’ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్(Tanya Ravichandran) ‘రాజా విక్రమార్క’ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ చిరు చెల్లిగా నటించి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. గ్లామర్ పాత్రలో నటించి తాన్యా యూత్‌లో ఫుల్ క్రేజ్‌ను రాబట్టుకుంది. ఇక ఇటీవల ‘మయసభ’ (Maya Sabha)వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘రెట్ట తల’ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. అరుణ్ విజయ్ హీరోగా నటిస్తుండగా.. క్రిస్ తిరుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాన్యా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నాకు పాత్ర నచ్చితే చాలు స్క్రీన్ టైమ్ ఎంత ఉందనేది ఆలోచించను. ఆ పాత్ర నాకు సెట్ అవుతుందనిపిస్తే.. స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటే నటించేందుకు ఒప్పుకుంటా. ఒకేలాంటి పాత్రలను కాకుండా ఇప్పటినుంచి వెరైటీ పాత్రలు చేయాలనుకుంటున్నాను. నాకు వచ్చే క్యారెక్టర్‌ను బట్టి నా యాక్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కు తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం లేదా ఏదైనా కొత్తగా నేర్చుకోవడం వంటివి ట్రై చేస్తాను. మంచి సినిమాల్లో నటించి స్టార్ అనిపించుకోవడమే నా లక్ష్యం. ఎప్పటికైనా అలాంటి పేరు తెచ్చుకుంటాననే నమ్మకం నాకు ఉంది’’ అని చెప్పుకొచ్చింది.






