నా వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తా.. ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు: Keerthy Suresh

by Hamsa |   ( Updated:2023-06-03 07:55:11.0  )
నా వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయ్యాక నేనే చెప్తా.. ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు: Keerthy Suresh
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’లో చిరు చెల్లెలిగా కనిపించబోతుంది. అలాగే కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన చిత్రం ‘మామన్నన్‌’ లో కీర్తి కథానాయికగా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తికి మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై ఆ అమ్మడు క్లారిటీ ఇచ్చింది. ‘‘ నా పెళ్లికి సంబంధించిన వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా. మీరంతా వివాహం గురించే ఎందుకు అడుగుతున్నారు. నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు. నా వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నాక స్వయంగా నేనే ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు.. ప్రతి ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించాల్సిన అవసరం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా,‘మామన్నన్’ మూవీ జూన్ 29న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Also Read..

Keerthy Suresh: బాయ్ ఫ్రెండ్ నాకు తెలుసు.. వారి వల్ల మనఃశాంతి కరువైంది.. ఆమె తండ్రి షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story