- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇక నుంచి అలాంటి పాత్రలే చేస్తా.. రీఎంట్రీపై బాలయ్య బ్యూటీ షాకింగ్ రియాక్షన్
ఒకప్పటి హీరోయిన్ నమిత(Namitha) ‘సొంతం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి ఆ తర్వాత అన్ని భాషల్లో నటించింది.

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ నమిత(Namitha) ‘సొంతం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయి ఆ తర్వాత అన్ని భాషల్లో నటించింది. స్టార్ హీరోలతో నటించిన నమిత ఐటమ్ సాంగ్స్‌లోనూ చిందులేసింది. మరీ ముఖ్యంగా ‘జైసింహ’(Jai Simha) చిత్రంలో బాలయ్య(Balakrishna)తో నమిత చేసిన సాంగ్ సోషల్ మీడియాలో ఊపేసిందని చెప్పొచ్చు. ఇక 2010 తర్వాత తెలుగులో కనిపించలేదు. మిగతా భాషల్లో నటించినప్పటికీ.. తన పర్సనల్ లైఫ్ కారణంగా.. నమిత 2019 నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇక అప్పటినుంచి తన కుటుంబ బాధ్యతలు తీసుకుని ఇంట్లోనే గడుపుతోంది. ఇన్నేళ్లకు మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ గతంలో చేసిన తప్పులను రిపీట్ కాకుండా.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ.. విభిన్న కథలను ఎంచుకోవాలని నిర్ణయించుకుందట. అంతేకాకుండా పవర్ ఫుల్ పాత్రలు మాత్రమే ఒకే చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నమిత ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కథలు వింటున్నాను. నా పాత్ర నచ్చకపోతే మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నాను. గ్లామరస్ పాత్రల్ని చేయాలపుకోవడం లేదు.. కానీ పవర్ ఫుల్ రోల్ కోసం ఎదురుచూస్తున్నాని చెప్పింది. రజినీకాంత్ ‘నరసింహా’ సినిమాలో రమ్మకృష్ణ చేసిన నీలాంబరి వంటి పాత్రలు చేయాలని ఉంది. సినిమా వచ్చి ఏళ్లకు ఏళ్లు అవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారని తాను కూడా అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట బయటపెట్టింది. ఎప్పటికీ గుర్తుండుపోయే పాత్రలు చేస్తే ప్రేక్షకులు తనను మళ్లీ ఆదరిస్తారని అంటోంది. విద్యాబాలన్, రాధికా ఆప్టే కథకు బలం చేకూర్చే పాత్రల్లో కనిపిస్తారు. ఇక నుంచి నేను కూడా వాళ్లిద్దరి లాగా చేయాలనుకుంటున్నానని పేర్కొంది. కానీ ఏ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుందో వెల్లడించలేదు. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.






