Amitabh Bachchan: ఐశ్వరాయ్‌ని పబ్లిక్‌గా పొగడను.. అవమానకరంగా మాట్లాడితే సహించనంటూ అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-24 10:59:36  IST  )

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Amitabh Bachchan: ఐశ్వరాయ్‌ని పబ్లిక్‌గా పొగడను.. అవమానకరంగా మాట్లాడితే  సహించనంటూ అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఇప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలతో పాటు పలు టీవీ షోల్లోనూ హోస్ట్‌గా వ్యవహిరిస్తున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. అలాగే తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతో పాటు కొంత మందికి కౌంటర్లు కూడా వేస్తున్నారు. తాజాగా, అమితాబ్ బచ్చన్‌ను ఓ నెటిజన్‌ మీ కొడుకును పొగుడుతారు. కానీ ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), జయా బచ్చన్‌(Jaya Bachchan)ను ఎందుకు ప్రశంసలు కురిపించరు ఎందుకు అని అడగ్గా.. ‘‘నేను నా కొడుకును పబ్లిక్‌గా ప్రశంసిస్తారు.

కానీ ఐశ్వర్య, జయా బచ్చన్‌ను నా మనసులోనే పొగుడుతాను. పబ్లిక్‌గా పొగడను. అది నాకు ఆడవారిపై ఉన్న గౌరవం. అంతే తప్ప వారిని పట్టించుకోను అని కాదు. నేను స్త్రీల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాను. నా వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దని నా అభిప్రాయం. అందుకే అందరిలో వారిని పొగడను. నేను నా కుటుంబానికి పెద్ద. ఐశ్వర్య నా కోడలు కాదు, ఆమె నా కూతురు. ఎవరైనా ఆమె గురించి అవమానకరంగా మాట్లాడితే, నా చివరి శ్వాస వరకు నేను ఆమె కోసం పోరాడుతాను.

అభిషేక్‌ను, నన్ను ఏదైనా అంటే భరిస్తాను. కానీ ... మీరు నా ఇంట్లోని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఓ నెటిజన్ మీకున్నదంతా పెయిడ్ ఫ్యాన్స్ అని పెట్టగా.. ఆ విషయాన్ని నువ్వు నిరూపించగలవా? నీది చాలా చిన్న మైండ్ అందుకే అలా అనుకుంటున్నావ్. నువ్వు కూడా డబ్బులు పెట్టి అభిమానులను సంపాదించుకో అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Next Story