- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. రిషబ్ శెట్టి ఎమోషనల్ ట్వీట్
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార:చాప్టర్1’ (Kantara: Chapter 1)బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty)స్వయం దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార:చాప్టర్1’ (Kantara: Chapter 1)బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్లు సైతం బాగానే రాబడుతోంది. అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. థియేటర్స్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు సైతం పెడుతున్నారు. తాజాగా, ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.
‘‘2016లో నేను దర్శకత్వం వహించిన సినిమా సాయంకాలం షో ప్రదర్శించడం కోసం పడిన కష్టం నుంచి 2025లో 5000లకు పైగా థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించే వరకూ ఇది నా జర్నీ. ఈ సినిమా ప్రయాణం దేడువి దయతో పాటు మీ ప్రేమాభిమానాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మీ ఆదరణతోనే ఈ విషయం సాధ్యమైంది. నన్ను ఆదరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరూనా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. దీంతో అది చూసిన అభిమానులు ఎప్పటికీ మా సపోర్ట్ ఉంటుందన్నా.. బాధపడకండి అని కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈసినిమా సూపర్ హిట్ ‘కాంతార’కు సీక్వెల్‌గా వచ్చింది. ఇందులో రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా.. మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది.






