Varun Dhawan: త్వరలో మీ అందరినీ నవ్విస్తాను.. కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) గత ఏడాది ‘బేబీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Varun Dhawan: త్వరలో మీ అందరినీ నవ్విస్తాను.. కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ వరుణ్ ధావన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) గత ఏడాది ‘బేబీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ ‘హై జవానీ తో ఇష్క్ హై’ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఆయన తండ్రి డేవిడ్ ధావన్(David Dhawan) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మౌని రాయ్, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాను టిప్స్ ఫిల్మ్స్ ప్రజెంట్స్ బ్యానర్‌పై రమేష్ తరణి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ‘హై జవానీ తో ఇష్క్ హై’ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ మంచి రెప్పాన్స్‌ను దక్కింకోగా.. అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, వరుణ్ ధావన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘‘స్కాట్లాండ్‌లో మా సినిమా ‘haijawaanitohishqhonahai’ కోసం మా షెడ్యూల్ ముగిసింది. చాలా రోజులుగా అందరూ కలిసి దీన్ని సాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలో మీ అందరినీ నవ్విస్తాను. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తున్నాము’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన వరుణ్ అభిమానులు, నెటిజన్లు మేము ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు.

Next Story