గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను.. ఈ ఒక్కసారి చాన్స్ ఇవ్వండి: శ్రీనందు

by Mallepaka Hamsa |

యంగ్ హీరో శ్రీ నందు(Sri Nandu) నటిస్తున్న మూవీ 'సైకో సిద్ధార్థ'(Psycho Siddhartha). ఈ సినిమా రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్‌తో వస్తున్నారు.

గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను.. ఈ ఒక్కసారి చాన్స్ ఇవ్వండి: శ్రీనందు
X

దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీ నందు(Sri Nandu) నటిస్తున్న మూవీ 'సైకో సిద్ధార్థ'(Psycho Siddhartha). ఈ సినిమా రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్‌తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి (Varun Reddy)దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నందు మాట్లాడుతూ..ఈ సినిమాకి మీలాంటి యువకుడి కథ అనే టాగ్లైన్ పెట్టాం. ఈ కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలాగా యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ప్రతి పాత్రకి న్యాయం చేశాను. ఏ ఒక్కరోజు కూడా నా నటన గురించి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. ఆర్ సి బి లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్లకి విజయం రావడానికి 18 ఏళ్లు పట్టింది. నా 18 ఏళ్ల జర్నీ అయింది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈసారి విజయం మనదే. సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ కొందరికి నచ్చుతుంది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. ‘సైకో సిద్ధార్థ’ మీకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు క్షమాపణలు చెప్తాను. ఇది పొగరుగా చెప్పడం లేదు చాలా వినయంగా చెప్తున్నాను. ఒక వేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటా సినిమాలు చేస్తాను. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. అందరూ థియేటర్స్‌కి వచ్చి మా చిత్రాన్ని చూడండి’’ అన్నారు.

Next Story