త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాం: విజయ్‌తో రొమాన్స్‌పై Rashmika Mandanna

by Phanindra |   (  Updated:2023-01-04 08:43:58  IST  )

సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులర్ జోడిని చూసినప్పుడల్లా ఇద్దరు ఒకటైతే బాగుండని అభిమానులు కోరుకుంటారు.

త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాం: విజయ్‌తో రొమాన్స్‌పై Rashmika Mandanna
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులర్ జోడిని చూసినప్పుడల్లా ఇద్దరు ఒకటైతే బాగుండని అభిమానులు కోరుకుంటారు. అలా ఇప్పటివరకూ చాలామంది సెలబ్రెటిలు పేర్లు వినిపించాయి. అందులో విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కరు. వీరిద్దరూ కలిసి నటించిన 'గీత గోవిందం' మూవీతో బాగా ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి తరచూ వీళ్లు జంటగా కనిపించడంతో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక-విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా ఒకే చోట ఉన్న ఫొటోలు విడివిడిగా షేర్ చేయడంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. అయితే రీసెంట్‌గా రష్మిక (Rashmika Mandanna) మీడియాతో మాట్లాడుతూ..'చాలామంది నేను విజయ్ కలిస్తే చూడాలని కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతానికి తనతో ఎలాంటి సినిమా లేదు. ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది తప్పకుండా తనతో సినిమా చేస్తా. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ చెబుతా' అని క్లారిటీ ఇచ్చింది.

Also Read...

అనారోగ్యంతో బాధపడుతున్న 'బిగ్‌బాస్' బ్యూటీ!

Next Story