జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

నేడు సురేఖ గారి పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానులనే కాకుండా, సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది.

జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: వెండితెరపై కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి, తన ఇంటిలో అసలైన స్టార్ మాత్రం తన భార్య సురేఖ ( Surekha )గారే. నేడు సురేఖ గారి పుట్టినరోజును పురస్కరించుకుని చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానులనే కాకుండా, సామాన్య ప్రజలను కూడా ఆకట్టుకుంటోంది. తమ 44 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం గురించి ఆయన రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. సాధారణంగా చిరంజీవి సక్సెస్‌ను చూసి అందరూ ఆయన టాలెంట్ లేదా కష్టం అనుకుంటారు. కానీ, చిరంజీవి మాత్రం ఆ క్రెడిట్ అంతా సురేఖ గారికే ఇచ్చారు. ‘‘నేను షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా, ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుని కుటుంబాన్ని ఏకం చేసిన వంతెన సురేఖే.

తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే, నేను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగాను’’ అంటూ తన విజయం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. తన భార్య కేవలం ఒక భాగస్వామి మాత్రమే కాదు, తన సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది అని ఆయన కొనియాడారు. చిరంజీవి తన పోస్ట్‌లో సురేఖ గారి వ్యక్తిత్వాన్ని మరోసారి ఆకాశానికెత్తారు. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను కోడలిగా కాకుండా ఒక సొంత కూతురిలా చూసుకుంటూ అందరి మనసు గెలుచుకుందని ఆయన ఎమోషనల్ అయ్యారు. తన జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని చిరంజీవి పేర్కొన్న ఈ పోస్ట్, ఒక భార్య పట్ల భర్తకు ఉండాల్సిన గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. పుట్టినరోజు.. పెళ్లి రోజు దగ్గర దగ్గరగా రావడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. link


Next Story