- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను టార్గెట్ చేసిన వారికి సమాధానమిస్తా.. ట్రోలర్స్‌కు నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్
వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi)కి నిరాశే ఎదురవుతోంది.

దిశ, సినిమా: వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi)కి నిరాశే ఎదురవుతోంది. ఈ మధ్య కాలంలో ఆయన బ్యానర్‌లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆడియన్స్‌ను అలరించలేకపోతున్నాయి. అయినప్పటికీ నాగవంశీ మాత్రం ఏ మాత్రం బాధపడకుండా వెనకడుగు వేయకుండా.. ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇక పలు ఈవెంట్లకు కూడా హాజరవుతూ.. తనదైన స్టైల్లో స్పీచ్‌లు ఇస్తున్నారు.
దీంతో కొందరు నెటిజన్లు కావాలనే ఆయనను టార్గెట్ చేస్తూ.. ట్రోల్ చేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై నాగవంశీ స్పందించాడు. ‘‘ఈ ఏడాది మా బ్యానర్ నుంచి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దానికి కొంతమంది నన్ను బాగా టార్గెట్ చేశారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే మా బ్యానర్ నుండి నెలకు ఒక సినిమా రిలీజ్ అవుతున్నాయి. అన్ని కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి. నన్ను ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి త్వరలోనే సమాధానం చెప్తాను’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






