- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి సీన్స్ చేయడానికి చాలా భయపడ్డాను..బయటకు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాను: సోనమ్ బజ్వా
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనమ్ బజ్వా (Sonam Bajwa)వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సోనమ్ బజ్వా (Sonam Bajwa)వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల ‘హౌస్‌ఫుల్-5’ మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ‘ఏక్ దివానే కి దివానీయత్’(Ek Deewane Ki Deewaniyat)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హర్షవర్ధన్ (Harshavardhan)హీరోగా నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనమ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘పంజాబ్‌లో అందరూ ఒకే అంటారా అని ఆలోచించి.. నేను బాలీవుడ్‌లో కొన్ని ఆఫర్‌లను వదులుకున్నాను.
మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా అనే మనస్తత్వం నాకు ఉంది. ఆ సమయంలో కిస్సింగ్ సీన్స్ చేయడానికి నేను చాలా భయపడ్డాను. ప్రజలు దానికి ఎలా స్పందిస్తారు? నన్ను మార్చిన నా కుటుంబం ఎలా స్పందిస్తారు? ఇది కేవలం సినిమా కోసమే అని నా కుటుంబం అర్థం చేసుకుంటుందా? అనే ప్రశ్నలు నా మనసులో చాలా మెదిలాయి. చాలా రోజులు అలాంటి ఆలోచనలతోనే సతమతమయ్యాను. రెండు సంవత్సరాల క్రితం నేను చివరికి మా అమ్మానాన్నలతో దీని గురించి మాట్లాడాను. దానికి వారు 'అవును, అది సినిమా కోసమే అయితే పర్వాలేదు' అని అన్నారు. అది విన్న తర్వాత నేను చాలా షాక్ అయ్యాను.
ఆ తర్వాత నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నేను వారితో ఎందుకు ముందుగా మాట్లాడలేదా? అని ఫీల్ అయ్యాను. చాలా ఆలోచనలు పెట్టుకొని దాని గురించి ప్రస్తావించడానికి కూడా నేను సిగ్గుపడ్డాను. కానీ వారు మాత్రం ఇది సినిమా కోసం కాబట్టి మాకు ఎటువంటి సమస్య లేదు నటించమని చెప్పారు. అందుకే అప్పటినుంచి ఎలాంటి పాత్రలైనా చేయాలని డిసైడ్ అయ్యాను. విభిన్న పాత్రలో నటించాలని ఉంది’’ అని చెప్పుకొచ్చింది.
READ MORE ....
ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ ‘లోకా: చాప్టర్1’.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?






