సెట్‌లో అతను అలా చేయడంతో చాలా ఇబ్బంది పడ్డా.. తట్టుకోలేకపోయానంటూ ‘కన్నప్ప’ నటి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ఒకప్పటి హీరోయిన్ మధుబాల(Madhubala) ‘రోజా’ సినిమాతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

సెట్‌లో అతను అలా చేయడంతో చాలా ఇబ్బంది పడ్డా.. తట్టుకోలేకపోయానంటూ ‘కన్నప్ప’ నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ మధుబాల(Madhubala) ‘రోజా’ సినిమాతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాలు చేసిన ఆమె గత ఏడాది ‘గేమ్ ఇన్’ (Game in)మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa) సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీని ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) తెరకెక్కిస్తుండగా.. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, నటి మధుబాల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ఇంటిమేట్ సీన్స్‌లో నటించడం నాకు నచ్చదు. అందుకే నేను సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయాను. అసలు గ్లామరస్ పాత్రలు కిస్, రొమాంటిక్ సీన్స్‌లో నటించకూడదని డిసైడ్ అయ్యా. కానీ ఓ సినిమా సమయంలో ఆ రూల్ బ్రేక్ చేశాను. షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ కిస్ సీన్ చేయమని చెప్పాడు. దీంతో షాక్ అయిన నేను అస్సలు చేయనని చెప్పాను. దీంతో కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ సీన్ సినిమాకు చాలా ముఖ్యమని చెప్పడంతో నటించక తప్పలేదు.

ఆ తర్వాత చాలా బాధపడ్డాను. అసలు నేనేనా అలా చేసింది అనుకున్నాను. కానీ మూవీ రిలీజ్ సమయానికి మొత్తానికే ఆ సీన్ తొలగించారు. అయినప్పటికీ నేను కష్టపడి చేశాను ఎందుకు తొలగించారని నేను డైరెక్టర్‌తో గొడవ పెట్టుకోలేదు. సినిమా కోసం ఎలాంటి సీన్స్ అయినా చేయాల్సి ఉంటుందని కొందమంది యాక్టర్స్‌ను చూసి అర్థం చేసుకున్నాను. ఒక నటి మూవీ కోసం ఏమైనా చేయాల్సిందే’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మధుబాల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story