- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోయా.. ఇలాంటి పాత్ర చేయడం మొదటిసారంటూ చిత్రాంగద ఆసక్తికర కామెంట్స్
తన మేకప్, హెయిర్ స్టైల్, దుస్తులు మార్చిన తర్వాత తనను తాను చూసుకుంటే తనకే ఆశ్చర్యం కలిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

దిశ, సినిమా: బాలీవుడ్ అందాల నటి చిత్రాంగద సింగ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ “మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్”. ఈ సినిమా ద్వారా ఈ ఇద్దరు స్టార్స్ తొలిసారి వెండితెరపై జంటగా కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్రాంగదా సింగ్.. తన పాత్ర గురించి షూటింగ్ విశేషాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో తన పాత్ర కోసం దర్శకుడు అపూర్వ లఖియా ఒక కఠినమైన నిబంధన పెట్టారట. "చిత్రాంగద అంటే ఒక గ్లామరస్ ఇమేజ్ ఉంటుంది. కానీ, ఈ సినిమాలో నేను చిత్రాంగదలా అస్సలు కనిపించకూడదని ఆయన ముందే చెప్పారు" అని ఆమె తెలిపారు. తన మేకప్, హెయిర్ స్టైల్, దుస్తులు మార్చిన తర్వాత తనను తాను చూసుకుంటే తనకే ఆశ్చర్యం కలిగిందని ఆమె చెప్పుకొచ్చారు. కేవలం లుక్ మాత్రమే కాదు, ఒక సాధారణ గృహిణిలా కనిపించడం కోసం తన నడక, కూర్చునే తీరు, బాడీ లాంగ్వేజ్ కూడా పూర్తిగా మార్చుకున్నట్లు ఆమె వివరించారు.
ఈ చిత్రంలో చిత్రాంగద పాత్ర చాలా సున్నితంగా ఉంటుందట. తన కుటుంబమే ప్రపంచం అని భావించే ఒక నిరుపేద, సామాన్య మహిళగా ఆమె నటించారట. "గత ఇరవై ఏళ్ల కెరీర్‌లో నేను ఎన్నో రకాల పాత్రలు చేశాను. ప్రొఫెసర్‌గా, విలేజ్ టీచర్‌గా, మోడ్రన్ ఉమెన్‌గా కనిపించాను. కానీ, ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి. ఈ పాత్రలో డైలాగుల కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది" అని చిత్రాంగద పేర్కొన్నారు. సుధీర్ మిశ్రా వంటి దర్శకులు రాసే పవర్‌ఫుల్ మహిళా పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ అనే పేరుతో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం, 2020లో ఇండియా-చైనా సరిహద్దుల్లో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మిలిటరీ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2026లో విడుదల చేయాలని అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ప్రస్తుతం ఆగస్టు నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.






