- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వేడుకకు నన్నెందుకు రమ్మన్నారని షాక్ అయ్యా.. కమల్ హాసన్‌ను పిలవాల్సిందంటూ సూపర్ స్టార్ ఆసక్తికర కామెంట్స్ (వీడియో)
తమిళ రచయిత ఎస్ వెంకటేశన్ రచించిన ‘వేల్పరి’ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చిన కారణంగా ఓ ఈవెంట్ నిర్వహించారు.

దిశ, సినిమా: తమిళ రచయిత ఎస్ వెంకటేశన్ రచించిన ‘వేల్పరి’ పుస్తకానికి మంచి రెస్పాన్స్ వచ్చిన కారణంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్(Rajinikanth)ను గెస్ట్‌గా పిలిచారు. దీంతో ఈ వేడుకల్లో హాజరైన సూపర్ స్టార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ వేల్పరి కార్యక్రమానికి అతిథిగా నన్ను పిలిచినప్పుడు 75 ఏళ్ల వయసులో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని స్లో మోషన్‌లో నటించే నన్నెందుకు పిలిచారా? అని షాక్ అయ్యాను. ఏం మాట్లాడాలి అనేది విజ్ఞానం. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ. ఎంత మాట్లాడాలనేది స్టేజిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏం చెప్పాలి.. ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుంచి నేర్పుకోవాల్సిన పాఠం.
ఎందుకంటే ఈ మధ్య నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అందుకే ఈసారి ఆచితూచి మాట్లాడులనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు శివకుమార్, కమల్ హాసన్(Kamal Haasan) వంటి మేధావులను పిలవాల్సింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. కాగా, రజినీకాంత్ ‘కూలీ’(coolie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తుండగా.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.






