- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి సినిమాలు చేయాలనుంది.. తన కోరిక బయటపెడుతూ అదితి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్(Aditi Shankar) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్(Aditi Shankar) అందరికీ సుపరిచితమే. ఆమె వైద్య విద్యలో పట్టభద్రులరాలు అయినప్పటికీ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ‘విరుమాన్’(Viruman)తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక ఇటీవల ‘భైరవం’ (Bhairavam)సినిమాతో ప్రేక్షకులను మెప్పించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘ఒన్స్’ చిత్రంతో రాబోతుంది. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘‘నా తండ్రిని చూసి నాకు నటనపై ఆసక్తి కలిగింది. చిన్నతనంలోనే నటిని అవ్వాలని బలంగా అనుకున్నాను. దీంతో చదువుకునే సమయంలోనూ నా తండ్రికి చెప్పాను. ఆయన మాత్రం ముందు చదువు పూర్తి చేయాలని చెప్పడంతో నాకు ఎంతో ఇష్టమైన వైద్య విద్యను ఎంచుకుని దానిని పూర్తి చేశాను. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఒకవేళ నేను ఇక్కడ సక్సెస్ కాలేకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడతాను. ప్రస్తుతం నేను నటిగా నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందడుగు వేస్తున్నాను.
నాకు ఒక చారిత్రక కథా చిత్రంలో నటించాలన్నది నా ఆశ. అలాంటి సినిమాల కోసం నేను ఎదురు చూస్తున్నాను.. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం ఎంత కష్టం అయినా సరే నటించడానికి ఒప్పుకుంటాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు తండ్రిలాగే నువ్వు కూడా ఇండస్ట్రీలో స్టార్ అవుతావని అభిప్రాయపడుతున్నారు.






