- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోను చూస్తే నాకు చాలా అసూయగా ఉండేది.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన విశాల్
నిజం చెప్పాలంటే, అప్పట్లో నాకు ప్రశాంత్ అంటే చాలా అసూయగా ఉండేది. మా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ అతన్ని ఒక రేంజ్‌లో ఆరాధించేవారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని తోటి నటుడు ప్రశాంత్ ఎదుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఇటీవల ఆంధ్రప్రదేశ్ వెళ్ళాను. అక్కడ ఒక చిన్న పల్లెటూరిలో ‘యూత్’ మూవీ పోస్టర్ చూశాను. ఒక తమిళ సినిమాకు తెలుగులో కూడా ఇంతటి ఆదరణ లభించడం, అక్కడి యువత ఆ చిత్రాన్ని అంతలా ఓన్ చేసుకోవడం చూసి నాకు చాలా గర్వంగా అనిపించింది. దీనికి జీవీ ఒక ముఖ్య ఆధారం. మన సినిమాలు భాషా సరిహద్దులు దాటి వెళ్లడం నిజంగా గొప్ప విషయం" అని సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ గురించి విశాల్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "నిజం చెప్పాలంటే, అప్పట్లో నాకు ప్రశాంత్ అంటే చాలా అసూయగా ఉండేది. మా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ అతన్ని ఒక రేంజ్‌లో ఆరాధించేవారు. అతనికి ఉన్న ఫాలోయింగ్ చూసి ముచ్చటగా అనిపించేది.
అప్పట్లో ప్రశాంత్‌కు వరుసగా అవకాశాలు వచ్చేవి, పైగా ఆయన వరుసగా సిల్వర్ జూబ్లీ ఘనవిజయం సాధించిన చిత్రాలను అందించారు" అని విశాల్ పేర్కొన్నారు. తన సినీ ప్రయాణం గురించి చెబుతూ.. "ప్రశాంత్ చూడటానికి చాలా అందంగా ఉండేవాడు, అందుకే అతనికి త్వరగా అవకాశాలు వచ్చాయి. కానీ నా రంగు వల్ల నాకు అవకాశాలు రావడానికి చాలా సమయం పట్టింది. చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది" అని విశాల్ తన మనసులోని మాట బయటపెట్టారు. ప్రస్తుతం యువత సినిమాల పట్ల చూపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని విశాల్ అన్నారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, తోటి నటుడిపై తనకు ఉన్న అసూయను, తన రంగు వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను ఇంత ఓపెన్‌గా చెప్పడంతో నెటిజన్లు విశాల్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.






