ఇండస్ట్రీకి రాకముందు కృతి శెట్టి అలాంటి పని చేసేదా.. బయటడ్డ నిజాలు!

by Disha Web Desk 6 |
ఇండస్ట్రీకి రాకముందు కృతి శెట్టి అలాంటి పని చేసేదా.. బయటడ్డ నిజాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి, మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో బేబమ్మ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతో మంచి సక్సెస్ అందుకుని ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత ఈ అమ్మడుకి వరుస చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. వరుసగా మూడు సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. కానీ ఆ తర్వాత సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో కాస్త అవకాశాలు తగ్గాయి. కృతి తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు సినిమాల్లో ఛాన్స్ అందుకుంటుందో. ప్రస్తుతం బేబమ్మ తెలుగులో శర్వానంద్ మూవీలో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తను ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదో తెలిపింది. సినిమాల్లోకి రాకముందు మీరు ఎలాంటి జాబ్ చేసేవారు, మీ సాలరీ ఎంత అని యాంకర్ ప్రశ్నించగా.. ‘‘ నేను కాస్త పెద్దయిన తర్వాత మా అమ్మకు కావాల్సిన గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా షాప్‌కు వెళ్లి నేనే తీసుకువచ్చేదాన్ని. అదే నా ఫస్ట్ జాబ్. నేను అలా అమ్మకు హెల్ప్ చేయగా ఆమె నాకు తన దగ్గర ఉన్నటువంటి డబ్బులో రూ.100 , రూ. 150 ఇచ్చేది అదే నా ఫస్ట్ సాలరీ’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా కృతి శెట్టి చివరిగా నాగచైతన్య కస్టడీ మూవీతో పలకరించింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద యావరేజ్ అనిపించుకుంది. ఈ అమ్మడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.



Next Story

Most Viewed