- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు లభింస్తుందని అర్థమైంది.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఇషాన్ కట్టర్(Ishan Khatter) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హోమ్‌బౌండ్’(Homebound).

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), ఇషాన్ కట్టర్(Ishan Khatter) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హోమ్‌బౌండ్’(Homebound). నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోవిడ్-19లాక్‌డౌన్ సమయంలో ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథను చెబుతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 26న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ సినిమా విడుదలకు ముందే.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. అంతేకాకుండా పలు అవార్డులు కూడా వచ్చాయి. ఈక్రమంలో.. తాజాగా, జాన్వీ కపూర్ తన సహ నటుడు ఇషాన్ కట్టర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘హోమ్‌బౌండ్ నా జీవితానికి ఉపయోగపడుతుందా.. లేదా అని ఆలోచించకుండానే అంగీకరించాను.
ఇందులోని ప్రతి సన్నివేశంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనప్పుడు వచ్చిన రెస్పాన్స్‌ను చూశాక ఆశ్చర్యపోయాను. ఈ సినిమా చేసినందుకు ప్రేక్షకులు నన్ను ట్రోల్ చేస్తారేమో అని ఎప్పుడూ అనుకోలేదు. ఇందులో నటించిన ఇషాన్ కట్టర్ దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకడు. కానీ ఇండస్ట్రీలో అతనికి ఇప్పటి వరకూ సరైన గుర్తింపు రాలేదు. కేన్స్‌లో ఇషాన్‌ను చూడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళల్లు అతన్ని ప్రశంసించడం చూస్తున్నాను. అందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని నాకు అప్పుడే అర్థమైంది. ఎట్టకేలకు మా సినిమా సెప్టెంబర్ 26 మీ ముందు రాబోతుంది. చూసి ఆధరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా, ఈ మూవీతో పాటు జాన్వీ తెలుగులో ‘పెద్ది’లోనూ నటిస్తోంది. ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించనుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పలువురు స్టార్స్ భాగం అయిన ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.






