మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతుంది.. ఉర్ఫీ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-16 07:32:34  IST  )

బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతుంది.. ఉర్ఫీ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. కానీ విన్నర్ కాలేకపోయింది. ఇక హౌస్‌నుండి బయటకు వచ్చేశాక తన ఫ్యాషన్ డ్రెస్‌లతో నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఎవరు ఎంత ట్రోల్ చేసినప్పటికీ వెరైటీ దుస్తులు ధరిస్తూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తనను ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తుంటుంది. తాజాగా, ఉర్ఫీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది. ఓ ప్రేమజంటపై కొంతమంది ట్రోల్ చేస్తుండగా.. వారికి గట్టిగా ఇచ్చిపడేసింది.

అసలు విషయంలోకి వెళితే.. ఎల్లి అవ్రామ్‌(Elli Avram), ఆశిశ్(Ashish) ఇటీవల తమ ప్రేమ విషయాన్ని కన్ఫార్మ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఓ ఫొటో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట పలు దారుణ కామెంట్లు చేస్తున్నారు. ఇకఈ విషయంపై ఉర్పీ ఇన్‌స్టా ద్వారా రియాక్ట్ అయింది. ‘‘ఇలాంటివి నా జీవితంలో చాలా చూశాను. ఈ రోజుల్లో స్త్రీలపై ద్వేషం చూపించడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది చూస్తుంటే మహిళల పట్ల ఈ ప్రపంచం ఎంత క్రూరంగా ఉందో అర్థమవుతోంది. కేవలం ఒక అమ్మాయి వయసును ఉద్ధేశించి కామెంట్స్ చేయడమేంటి. ఇక్కడ మహిళలను విలన్ చూపించడానికి, ద్వేషించడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అదే వారు ఉన్నతంగా భావిస్తున్నారు. సమాజం ఎల్లప్పుడూ మహిళలను విమర్శించడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Next Story