డైరెక్టర్ కట్ చెప్పకపోయేసరికి నా ప్రాణాలు పోయాయనుకున్నా.. వీడియో రిలీజ్ చేసిన జగపతి బాబు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ నటుడు, హీరో జగపతి బాబు(Jagapathi Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

డైరెక్టర్ కట్ చెప్పకపోయేసరికి నా ప్రాణాలు పోయాయనుకున్నా.. వీడియో రిలీజ్ చేసిన జగపతి బాబు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు, హీరో జగపతి బాబు(Jagapathi Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు హీరోగా పలు చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాల్లో నటిస్తున్నారు. జగపతి బాబు భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (peddi)లో కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సనా(Buchibabu Sana) తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఇదిలా ఉంటే.. జగపతి బాబు వరుస చిత్రాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘నా పేరు జగపతి రావు అయితే ఇండస్ట్రీలో రావులు ఎక్కువగా ఉన్నారని బాబుగా మార్చేశారు. అలా కొద్ది రోజులకు జగ్గూభాయ్‌గా మారిపోయాను. నేను ఓ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అంత:పురం సినిమా చివరి సీన్‌లో నేను చచ్చిపోయానని అనుకున్నాను. ఎందుకంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ ఆ సీన్‌లో లీనమైపోయి కట్ చెప్పలేకపోయాడు.

అప్పుడు నేను నిజంగానే పోయానేమో అనుకున్నా. నా కెరీర్ మొత్తంలో అంత:పురం క్లైమాక్సే ఫేవరెట్ షాట్. అయితే కొందరు నన్ను జుట్టు తెల్లబడిందని రంగు వేసుకోమని సలహా ఇస్తున్నారు. నాకు ఇప్పటివరకు జుట్టు ఉండటమే అదృష్టం అనుకుంటున్నా. అది సహజంగానే తెల్లబడింది కాబట్టి దాన్ని అలాగే వదిలేశాను. సహజంగా ఉంటేనే నేను బాగుంటాను. సన్నిలాగే వదిలేయండి. నాకు పెద్దగా కోరికలేం లేవు. చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే ప్రాణాయామం చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story