- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరణ్‌ను ఎత్తుకున్న రోజులు గుర్తొస్తున్నాయి.. మెగా ఫ్యామిలీకి రోజా విషెస్
సీనియర్ నటి రోజా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది.

దిశ, సినిమా: సీనియర్ నటి రోజా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉంటోంది. అయితే తాజాగా ఉపాసన పండంటి పాపకు జన్మనివ్వగా రోజా సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ‘ఎప్పుడూ శక్తివంతంగా, యవ్వనంగా ఉండే కొణిదెల కుటుంబానికి భగవంతుడు మెగా ప్రిన్సెస్ రూపంలో ఆశీర్వాదాలను అందించారు.
రామ్ చరణ్‌ను నా చేతులతో హత్తుకొని, ఎత్తుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి. అలాంటి చరణ్‌కు ఇప్పుడు పాప పుట్టింది. నాకు సంతోషంగా ఉంది. ఇక చిరంజీవి సార్ మీరు తాతయ్య అయినా నాకు మాత్రం ఎప్పటికీ హీరోనే. మీ ఇంటి చిన్న మహాలక్ష్మికి నా ఆశీస్సులు’ అని రోజా చెప్పుకొచ్చింది. ఇక ఇది చూసిన చిరు అభిమానులు ఎలాంటి గొడవలు మనసులో పెట్టుకోకుండా.. రోజా మాట్లాడిన తీరుకు ఫిదా అవుతున్నారు.
Also Read..
సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్యకు కలిసొస్తుందన్న వేణు స్వామి.. లక్ వచ్చే నెల ఇదే!






