Rajamouli : చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్

by Disha Web Desk 6 |
Rajamouli : చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘మేము ఫేమస్’. తనే ఈ సినిమాకు రైటర్, డైరెక్టర్ కావడం విశేషం. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ స్టోరితో తెరకెక్కిన ఈ చిత్రం మే 26న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డు టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. తాజాగా, దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించడం విశేషం. ‘‘చాలా కాలం తర్వాత థియేటర్‌లో ఓ సినిమాని బాగా ఎంజాయ్ చేశాను. ఈ అబ్బాయి సుమంత్ కోసం సినిమా చూడండి. నటుడిగా, దర్శకుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అన్ని పాత్రలు చక్కగా డిజైన్ చేయబడ్డాయి. నటీనటులు సహజంగా నటించారు. ముఖ్యంగా అంజి మామ. అందరూ చూడాలని కోరుకుంటున్నా. యూత్‌ను ఎంకరేజ్ చెయ్యాలె. ధమ్ ధమ్ చెయ్యొద్దు’’ అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్లు మీమ్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Read More... జక్కన్నను వెయిట్ చేయిస్తున్న మహేష్ బాబు

బైక్ నడపడం, ఫోన్ పే చేయడం.. తమతో కాలేదంటున్న స్టార్ హీరోలు

స్టార్ హీరోయిన్లనే మించిపోతున్న శ్రీలీల పారితోషికం!

వాడికి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు.. ఆ న్యూస్ ఛానల్‌ను బహిష్కరించండి: బండ్ల గణేష్ ట్వీట్


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed