- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా స్వార్థంతో నిన్ను ప్రమాదంలో పెట్టా.. నటికి క్షమాపణలు చెప్తూ ఆర్జీవీ షాకింగ్ ట్వీట్
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఆర్జీవీ(RGV) కాంబోలో 1998లో వచ్చిన ‘శివ’ (shiva)బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఆర్జీవీ(RGV) కాంబోలో 1998లో వచ్చిన ‘శివ’ (shiva)బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అమల హీరోయిన్‌గా జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద పెద్ద సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే. మళ్లీ 36 ఏళ్ల తర్వాత ‘శివ’ మూవీ నవంబర్ 14న రీరిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్జీవీ, నాగార్జున పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజాగా, రామ్ గోపాల్ వర్మ ‘శివ’లో నటించిన నటికి క్షమాపణలు చెప్తూ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమె మరెవరో కాదు.. శివ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్ సుష్మ. ఇందులో భవానీ గ్యాంగ్.. నాగార్జునను చేజ్ చేస్తుండగా.. నాగ్ ఓ చిన్న పాపను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని వేగంగా వెళ్తాడు.
ఇంతలో యాక్సిడెంట్ అయి ఇద్దరు కిందపడిపోతారు. అప్పుడు పాపను ఎత్తుకుని నాగ్ గూండాలతో ఫైటింగ్ చేస్తుంటాడు. అయితే ఆ పాప ఈ సినిమాలో నాగ్ అన్న కూతురిలా నటిస్తుంది. ఇక ఈ సీన్ గురించి ఆర్జీవీ తన తప్పు 36ఏళ్ల తర్వాత అర్థమైనట్లు తెలుపుతూ.. ‘‘సైకిల్ చేజ్ సీన్‌లో ఉంది ఈ చిన్నారే సుష్మ. అమెరికాలో ఏఐ, కాగ్నిటివ్ రీసెర్చ్ చేస్తోంది. సుష్మ నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. అప్పుడు ఆ సీన్ ఎంత ప్రమాదమనేది నాకు అర్థం కాలేదు. దర్శకుడిగా నా స్వార్థం చూసుకుని ఇలాంటి ప్రమాదకరమైన షాట్స్ తీశాను. అందుకు నన్ను క్షమించు. నాకు నా తప్పు ఇప్పుడు అర్థం అయింది’’ అని రాసుకొచ్చాడు.
అలాగే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన సుష్మ ఇప్పుడెలా ఉందో ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇక అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ.. నువ్వు క్షమాపణలు చెప్పావా అని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆర్జీవీ పోస్ట్‌పై సుష్మ స్పందిస్తూ.. ‘‘శివ సినిమాలో భాగం కావడం ఒక మధురమైన జ్ఞాపకంజ ఆ సైకిలం వేట సాహసం నన్ను ప్రభావితం చేసింది. ఆ తర్వాత మేధో ప్రయత్నాలు, సాహసాలకు నన్ను సద్ధం చేసుకునేలా స్ట్రాంగ్ అయ్యాను. ఇందులో నేను భాగం కావడం, సురక్షితంగా, ఉత్సాహంగా అనిపించింది. శివ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది’’ అని రిప్లై ఇచ్చింది.






