Kiara Advani : ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్న మరో హీరోయిన్.. ఇలియానాను చూసి ఇన్‌స్పైర్ అయిందా..?

by Anjali |
Kiara Advani : ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్న మరో హీరోయిన్.. ఇలియానాను చూసి ఇన్‌స్పైర్ అయిందా..?
X

దిశ, సినిమా: మనసుపడ్డ వాడితోనే మూడుముళ్లు వేయించుకున్న కియారా అద్వాణీ.. ఆ తర్వాత కూడా సినిమాలతో బిజీగానే ఉంది. రీసెంట్‌గా ‘సత్య ప్రేమ్ కీ కథ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకుంది. అయితే ఆమె ప్రస్తుతం పిల్లలు కనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి డిన్నర్ డేట్స్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది. ‘గుడ్ న్యూస్’ మూవీలో తన క్యారెక్టర్ మాదిరిగా తాను ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నానని.. అందుకే ఇష్టమైన ఫుడ్ తినేందుకు వెనుకాడట్లేదని తెలిపింది. ఇక మీరు ట్విన్స్ కావాలంటున్నారా అని యాంకర్ ప్రశ్నించగా.. హెల్తీ బేబీ కావాలని, కానీ ఒక అమ్మాయి, అబ్బాయి ఉండాలని చెప్పుకొచ్చింది బ్యూటీ. అయితే దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. ఇలియానాను చూసి ఇన్‌స్పైర్ అయ్యావా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed