ఆ మాట నేనెప్పుడూ అనలేదు.. దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి: కళ్యాణి ప్రియదర్శన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-24 03:46:08  IST  )

మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ఇటీవల ‘కొత్త లోకా’ (kotha lokha)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ మాట నేనెప్పుడూ అనలేదు.. దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి: కళ్యాణి ప్రియదర్శన్
X

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ఇటీవల ‘కొత్త లోకా’ (kotha lokha)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు కళ్యాణి మొట్టమొదటి ఫీమేల్ సూపర్ హీరోగా పేరు దక్కించుకుంది. అలాగే భారీ కలెక్షన్లు రాబడుతూ థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈక్రమంలో.. కళ్యాణి ప్రియదర్శన్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ పలు కామెంట్స్ చేస్తోంది. ఇక ఇటీవల ఆమె ‘‘ఎంతో ఆస్తి ఉన్నప్పటికీ జీవితం విలువ తెలియాలన్న ఉద్దేశ్యంతో మా తల్లిదండ్రులు తనను తన తమ్ముడిని చిన్నతనంలో వియత్నాంలోని ఓ అనాథాశ్రమంలో ఉంచారని.. అక్కడ అనాథ పిల్లలతో కలిసి ఉంటూ వాళ్లు తినే ఆహారమే తిన్నామని అనడం గమనార్హం.

నేలపైనే పడుకున్నాం. ఆ అనుభవం జీవితం విలువ ఏంటో నేర్పించింది అని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం కాస్త కళ్యాణి ప్రియదర్శన్ కంట పడటంతో ఈ అమ్మడు స్పందించి ట్విస్ట్ ఇచ్చింది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ కీలక విజ్ఞప్తి చేసింది. ‘‘ఈ మాట నేనెప్పుడూ అనలేదు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం ఆపండి. అసలు నేను అన్నానా లేదా? అనే విషయం తెలుసుకోకుండా తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు. ఇవన్నీ ఫేక్ నమ్మకండి. దయచేసి మీడియా వారు వార్తలు రాసేముందు నిజమా కాదా? అని ధృవీకరించుకోండి. ఈ తప్పుడు వార్తల వల్ల నా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు’’ అని చెప్పుకొచ్చింది.

Next Story