ఆ హీరో అంటే నాకు పిచ్చి.. అతనితో ఎన్ని సినిమాలైనా చేస్తా: Samantha

by Kodari Anjali |   (  Updated:2023-09-13 11:51:11  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో సమంత కూడా ఒకరు.

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. అతనితో ఎన్ని సినిమాలైనా చేస్తా: Samantha
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో సమంత కూడా ఒకరు. తాజాగా ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మంచి విజయాన్ని అందుకుంది. నటన, అందంతో అలరించింది. ముఖ్యంగా విజయ్‌తో రొమాన్స్ అదరగొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ కావడానికి వారిద్దరి మధ్య చూపించిన రొమాన్స్ అని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్.. ‘నేను సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగు పెట్టకముందు నుంచే పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని. ఆయనతో కలిసి ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. నాకు పవన్‌తో ఎన్నిసార్లు నటించే అవకాశం వచ్చినా మిస్ చేసుకోను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : సౌతిండియాలో Anirudh హవా.. చేతిలో మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

Next Story