సౌతిండియాలో Anirudh హవా.. చేతిలో మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?

by Disha Web Desk 9 |
సౌతిండియాలో Anirudh హవా.. చేతిలో మొత్తం ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈయన మ్యూజిక్ అందించిన చిత్రాలు దాదాపు బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో దర్శక, నిర్మాతలు వారి సినిమాల్లో సంగీతాన్ని సమకూర్చడానికి అనిరుద్‌నే ఎంచుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడి చేతిలో ఉన్న సినిమాల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న ‘లియో’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’.

కమల్ హాసన్, శంకర్ కాంబోలో రూపొందుతున్న ‘ఇండియన్ 2’ మూవీ. అలాగే విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమా, రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న తలైవార్ 171 చిత్రానికి కూడా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాదు.. తల అజిత్ ‘విడముయరచి’ అనే చిత్రానికి కూడా అనిరుదే మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రాలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇవి కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. అతనితో ఎన్ని సినిమాలైనా చేస్తా: సమంత

Next Story

Most Viewed