ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.. వరుణ్‌పై ప్రశంసలు కురిపించిన స్టార్ కిడ్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి(Ahaan Shetty) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు.

ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.. వరుణ్‌పై ప్రశంసలు కురిపించిన స్టార్ కిడ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి తనయుడు ఆహాన్ శెట్టి(Ahaan Shetty) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన వరుణ్ ధావన్(Varun Dhawan) హీరోగా నటిస్తున్న ‘బోర్డర్-2’(Border-2)లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా, అహాన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘అమృత్‌సర్‌లో నా చివరి రోజు షూటింగ్ అయిపోయింది. ఈ ప్రయాణం నాకు ఏం నేర్పిందో మాటల్లో చెప్పడం కష్టం. ఎందుకంటే సెట్‌లో మొదటి రోజు నుండే వరుణ్ ధావణ్ నన్ను ఇంట్లో ఉన్నట్లు భావించేలా చేశారు.

అతను నన్ను నడిపించాడు. జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు అన్నయ్యలా మద్దతు ఇచ్చాడు. అతను మనకు ఉన్న అతిపెద్ద స్టార్‌లలో ఒకడు. కెమెరాలు, లైట్లు, స్టార్‌డమ్‌ను తీసుకురావు. అతను చూపించే దయ, ప్రేమ అందరిలో కలిసిపోవడం ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. నేను వరుణ్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ అనుభవం నన్ను మార్చింది. అతని వల్లనే చాలా మారాను అనిపిస్తుంది. ధన్యవాదాలు సోదరా. ఈ ప్రయాణంలో జ్ఞాపకాలు నా తోనే ఉంటాయి. తదుపరి షెడ్యూల్ పెద్దది’’ అని రాసుకొచ్చాడు.

Next Story