Kriti Shetty: స్టార్ హీరోపై మనసు పారేసుకున్న కృతి శెట్టి.. తన కోరిక బయటపెడుతూ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

కృతి శెట్టి(Kriti Shetty) ‘ఉప్పెన’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

Kriti Shetty: స్టార్ హీరోపై మనసు పారేసుకున్న కృతి శెట్టి.. తన కోరిక బయటపెడుతూ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కృతి శెట్టి(Kriti Shetty) ‘ఉప్పెన’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటోంది. త్వరలో ‘వా వాతియార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో కార్తి(karthi) సరసన జతకట్టబోతోంది. నలన్ కుమారస్వామి (Nalan Kumaraswamy)దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టి తమిళ స్టార్స్ కార్తి, సూర్య(suriya)లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సూర్యతో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంటూ.. ‘‘సూర్య సార్ చాలా నైపుణ్యం కలిగిన, ప్రతిభావంతుడైన నటుడు. నేను అతని నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా ఆయన కళ్ళతోనే భావోద్వేగాలను వ్యక్తపరిచే విధానం సూపర్‌గా అనిపించింది. ‘వనంగాన్’ (Vanangan)సినిమాలో నేను దాదాపు సరం పూర్తి చేశాను. కానీ దురదృష్టవశాత్తు అందులో నేను ఫైనల్ కాలేదు. మధ్యలోనే తొలగించారు. అయినప్పటికీ భవిష్యత్తులో నాకు ఖచ్చితంగా అతనితో మళ్లీ పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. ఒకవేళ నా అదృష్టం బాగుండి వస్తే మాత్రం వదులుకోను.

షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని అయినా ఒప్పుకుంటా.. కష్టమైనా సరే అవకాశం వదులుకోకూడదని అనుకుంటున్నాను’’ అని చెప్పింది. అనంతరం కార్తీ గురించి చెప్తూ.. ‘‘కార్తి సార్ నాకు చాలా విషయాలు నేర్పించారు. ఆయన తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటారు. కార్తి సార్‌లో ఉన్న ప్రత్యేక లక్షణం అదే. ‘వా వాతియార్’లో నా పాత్ర థ్రిల్లింగ్‌గా ఉంటుంది. నేను 10 సంవత్సరాల వయసులో ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. తర్వాత మోడలింగ్ లోకి వచ్చాను.. ఆసక్తితో నటనలోకి అడుగుపెట్టాను. నాకు రేవతి మేడమ్ అంటే చాలా ఇష్టం. ఆమె చాలా ప్రతి భావంతురాలు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story